
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

విశాల్ 'నాట్ ఏ కామన్ మెన్'
తెలుగువాడైనా ఇక్కడ కంటే ఎక్కువగా తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశాల్. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా తన సినిమాలు రిలీజ్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక విశాల్ సినిమాల్లో ప్రయోగాలు కూడా బాగానే చేస్తుంటాడు. ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ కథలే కాకుండా డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ఈ మధ్యకాలంలో వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు.
విశాల్ 'చక్ర' స్నీక్ పీక్
ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందుతుంది. ఫుల్ టెక్నికల్ విలువలతో కొత్త కథ-కథనాలతో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
విశాల్ 'చక్ర' రిలీజ్ డేట్ ఫిక్స్
విశాల్ హీరోగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా 'చక్ర'. బ్యాంక్ రాబరీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఫుల్ టెక్నికల్ విలువలతో కొత్త కథ-కథనాలతో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు.