ట్యాగ్ · 4 కథనాలు
ప్రతి సినిమా విడుదలకు ఒక మొక్క నాటుతా..!
'V' చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి
ఫిల్మ్ స్టూడియో ప్లాన్ లో సుధీర్ బాబు
చిట్టి బాబు లాంటి పాత్రలో సుధీర్ బాబు ..!
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘వి’ మూవీ ఇటీవలే అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన సుధీర్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటివరకూ కాస్త లవర్ బాయ్ రోల్స్ లో కనిపించిన సుధీర్ బాబుకు ఈ సినిమా కమర్షియల్ హీరోగా మారడానికి బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు.
ప్రతి సినిమా విడుదలకు ఒక మొక్క నాటుతా..!
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ రోజురోజుకు వేగంగా వ్యాపిస్తుంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో అది రోజురోజుకు దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఛాలెంజ్ ను సుధీర్ బాబు స్వీకరించాడు. హీరో నవీన్ కృష్ణ సుధీర్ బాబుకు ఛాలెంజ్ విసరగా ఛాలెంజ్‌ను స్వీకరించిన సుధీర్ బాబు ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటారు.
'V' చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని,సుధీర్ బాబు,నివేద థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'వి' సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. దీనిలో భాగంగా సుధీర్ బాబు ది తెలుగుఫిలింనగర్.కమ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఇంటరెస్టింగ్ విషయాలు తెలిపారు.
ఫిల్మ్ స్టూడియో ప్లాన్ లో సుధీర్ బాబు
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో నటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన సుధీర్ బాబు "ప్రేమ కథా చిత్రమ్ ", "సమ్మోహనం "సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "బాఘీ" మూవీ తో సుధీర్ బాబు బాలీవుడ్ కు ప్రతినాయకుడిగా పరిచయం అయ్యారు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సుధీర్ బాబు, ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు.