ట్యాగ్ · 3 కథనాలు

'బిబి' సీక్రెట్ రివీల్ చేసిన నందు

'BB' అంటే అది కాదు - కన్ఫ్యూజ్ చేస్తున్న నందు
"బొమ్మ బ్లాక్ బస్టర్ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ హిట్ "100% లవ్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నందు "శివరంజని ", "సవారి " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నందు హీరోగా ప్రస్తుతం "బొమ్మ బ్లాక్ బస్టర్ " మూవీ లో నటిస్తున్నారు. విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో నందు , ప్రముఖ యాంకర్ , నటి రష్మీ గౌతమ్ జంటగా "బొమ్మ బ్లాక్ బస్టర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ R విహారి సంగీతం అందిస్తున్నారు.

'బిబి' సీక్రెట్ రివీల్ చేసిన నందు
ఫైనల్లీ నందు తన 'బిబి' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చెప్పేసాడు. గత రెండు రోజులుగా బిబి అంటూ నందు సోషల్ మీడియాలో ఎంత హడావుడి చేసాడో తెలిసిందే. డార్లింగ్స్ నేను బీబీలో ఉండబోతున్నా... బీబీలో మన రచ్చ మామూలుగా ఉండదు. మరింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు మీ సపోర్ట్ కావాలి` అంటూ.. ఆ తర్వాత మీరు అనుకునే బిగ్ బాస్ కాదని ఇది వేరే అని చెప్పడంతో .. అందరూ బిగ్ బాస్ అనే ఫిక్స్ అయిపోయారు. అయితే ఆ బిగ్ బాస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది. నందు చెప్పిన 'బిబి' ఏంటంటే అతని కొత్త సినిమా `బొమ్మ బ్లాక్‌బస్టర్` గురించి.

'BB' అంటే అది కాదు - కన్ఫ్యూజ్ చేస్తున్న నందు
బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ సందడి మొదలు కానుంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 4 త్వరలోనే ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంతో పకడ్భందీగా బిగ్ బాస్4 షోను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ఓ ప్రోమోను రిలీజ్ చేసింది కూడా స్టార్ మా. కాగా బిగ్ బాస్-4 షోలో మొత్తం 16 మంది పాల్గొనబోతుండగా మరోసారి హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించబోతున్నారు. యాథావిధిగా 106 రోజుల పాటు ఈ షో జరగనున్నట్టు తెలుస్తుంది.