
ట్యాగ్ · 6 కథనాలు


టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు

థియేటర్లలోనే SR కళ్యాణమండపం

నన్ను కంగారు పెట్టేది అదే
మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఎమోషన్ & ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ మూవీ
రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కున్న హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజన ఆనంద్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్కర్,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు…

టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'
టాలీవుడ్ లో టాప్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఇక దీనికి అనుసంధానంగా రీసెంట్ గా గీతా ఆర్స్ట్ 2 కూడా వచ్చింది. ఈ బ్యానర్ నుండి ఇప్పటివరకూ అరడజను వరకూ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు కూడా దాదాపు అన్నీ సక్సెస్సే అయ్యాయి. అంతేకాదు ఈ బ్యానర్ లో యంగ్ హీరోలకు.. కొత్త టాలెంట్ కు ఛాన్స్ లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ బ్యానర్ చాలా తక్కువ టైమ్ లోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.

ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా
రాజా వారు-రాణీగారు, ఎస్‌ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇక ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. టాప్ ప్రొడక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. బాబీ, గోపీచంద్ మలినేనిల వద్ద ఎన్నో సినిమాలకు పనిచేసిన రమేష్ కాదూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈసినిమాను ఎంతో మంది అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా…

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం సైలెంట్ గా ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే SR కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ మరో సినిమాను ప్రారంభించాడు. కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది.

థియేటర్లలోనే SR కళ్యాణమండపం
నూతన దర్శకుడు శ్రీధర్ గాదే దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగా వస్తున్న సినిమా SR కళ్యాణమండపం EST 1975. చిన్న సినిమా అయినా కూడా ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది ఈసినిమా. ఆ ఉత్కంఠని మరింత పెంచుతూ ఆ తరువాత విడుదల చేసిన చుక్కల చున్ని, చూసాలే కళ్లార వంటి పాటలు యూట్యూబ్ లో మిలయన్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి.