
ట్యాగ్ · 143 కథనాలు · పేజీ 8


'ఆచార్య' వచ్చేది అప్పుడేనట..!

చిరంజీవి, రెజీనా.. ఓ సెలబ్రేషన్ సాంగ్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మెరుపు వేగంతో జరుగుతోంది.

"ఆచార్య" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ?
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ""ఆచార్య" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. త్రిష కథానాయిక కాగా సోనూ సూద్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

'ఆచార్య' వచ్చేది అప్పుడేనట..!
ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను అనుకున్న టైం కే తీసుకురావాలని... తొందరగా సినిమాను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అన్ని పనులు తొందరగా పూర్తి చేసి ఆగస్టు 14 న విడుదల చేయాలని చూస్తున్నారట. ఎట్టి పరిస్థితులలో ఆగస్ట్ 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.మరి రీసెంట్ గానే సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్ లో మన సినిమా 100 రోజులలో పూర్తి చేయాలని చిరంజీవి దర్శకుడు కొరటాల దగ్గర మాట తీసుకున్నారు. అలా చిరంజీవి కోరుకున్నట్లు జరిగితే ఆగస్ట్ మిస్ అయ్యే సమస్యే లేదు.