ట్యాగ్ · 3 కథనాలు
దీపావళి కానుకగా "ఆకాశం నీ హద్దురా "
బాలీవుడ్ లోకి 'ఆకాశం నీ హద్దురా..!'
బాలీవుడ్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ మధ్య చాలా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. ఇంకా కొన్ని సినిమాలు లైన్ లో కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో సినిమాను రీమేక్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమా అలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే రీమేక్ కు రెడీ అయిపోయారు.

"ఆకాశం నీ హద్దురా " న్యూ మోషన్ పోస్టర్ రిలీజ్
2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా " సూరరై పోట్రు "(ఆకాశం నీ హద్దురా ) మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది.
దీపావళి కానుకగా "ఆకాశం నీ హద్దురా "
తమిళ స్టార్ హీరో సూర్యకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అధిక ఫాలోయింగ్ ఉంది. హీరో సూర్య నటించిన ప్రతీ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. " గజిని" , "యముడు" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో సూర్య తెలుగు ప్రేక్షకులను అలరించారు. హీరో సూర్య ఇప్పుడు "ఆకాశం నీ హద్దురా " మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.