ట్యాగ్ · 3 కథనాలు

ఆది 'అమరన్' ప్రారంభం
"అమరన్ "లో ఆది సాయికుమార్ న్యూ లుక్
బ్లాక్ బస్టర్ "ప్రేమకావాలి "మూవీ తో డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో ఆది అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "లవ్లీ ", రఫ్ ", చుట్టాలబ్బాయి ", ఆపరేషన్ గోల్డ్ ఫిష్ "వంటి మూవీస్ తో హీరో ఆది ప్రేక్షకులను అలరించారు. హీరో ఆది ప్రస్తుతం తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న "జంగిల్ ", "కిరాతక ", "అమరన్ " "బ్లాక్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

ఆది 'అమరన్' ప్రారంభం
ఆది సాయికుమార్ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ఉగాది రోజునే ఒక కొత్తసినిమాను ప్రారంభించాడు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఆది, సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా రూపొందుతుంది. విజయ్ కుమార్ రెడ్డి సమర్పణలో శిఖర క్రియేషన్స్ పతాకంపై యుగంధర్ టీ నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

ఆది కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ఇదిలా ఉండగా ఈరోజు అయన పుట్టినరోజు సందర్భంగా తన మూడు కొత్త సినిమాల్ని ప్రకటించారు.