సూపర్‌స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ‘అలా బొలేలో’ పాటను మేకర్స్ విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ అందించిన ఈ ఎనర్జెటిక్ డ్యాన్స్ నంబర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మొదటి భాగంలో సంచలనం సృష్టించిన ‘కావాలయ్యా’ తరహాలోనే పూర్తి పండుగ వాతావరణం, గ్రాండ్ విజువల్స్ మరియు క్యాచీ ట్యూన్‌తో ఈ పాటను సిద్ధం చేశారు. శమ్నా కాసిమ్ (పూర్ణ) హై-ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు, చివర్లో రజినీకాంత్ మార్క్ మాస్ లుక్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సీక్వెల్‌ను అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్‌తో జైలర్ 2 ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























