వెంకీ – కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ నుండి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ 

Makers Reveal Kalyan Ram’s First Look from #VenkyAnil5

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్,  బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ మ్యాసీవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ #VenkyAnil5 / #NkrAR2, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన,  జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో కనిపించారు. తెల్లటి పంచె, కుర్తా ధరించి, మెడలో పూలదండతో స్టైలిష్ సన్‌గ్లాసెస్ పెట్టుకుని డ్యాన్స్ స్టెప్ వేస్తూ ఆయన కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. చిరునవ్వుతో ఆయన లుక్ ఫెస్టివల్ వైబ్‌ను తీసుకొచ్చింది.

అందంగా అలంకరించిన సంప్రదాయ ఇంటి నేపథ్యంలో, రంగురంగుల పూలతోరణాలు, ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న మహిళల మధ్య రూపొందించిన ఈ పోస్టర్ సినిమా పండుగ వాతావరణాన్ని అద్భుతంగా చూపిస్తోంది. ఇది నిజమైన “అచ్చ తెలుగు” ఫస్ట్ లుక్ అని చెప్పొచ్చు. ఫన్, కామెడీ, ఎమోషన్స్, గ్రాండ్ సెలబ్రేషన్స్‌తో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా సినిమా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తోంది.

విశేషం ఏమిటంటే, ఈ ఫస్ట్ లుక్‌ను షేర్ చేయడానికి కళ్యాణ్ రామ్ @నందమూరికళ్యాణ్‌రామ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించారు. “అనిల్ రావిపూడి జోన్‌లో ఉండటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది… సంక్రాంతి 2027కి ఒక భారీ ఎంటర్టైనర్‌కు సిద్ధంగా ఉండండి” అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇది కూడా అనిల్ రావిపూడి సినిమాల ప్రమోషన్స్‌లో ఉండే ప్రత్యేకతను మరోసారి చూపించింది.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ వేగంగా జరుగుతోంది.

ఈ ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ చేయగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌. ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఎమోషన్స్, ఫుల్ ఎంటర్టైన్‌మెంట్‌తో ఈ సినిమా సంక్రాంతి 2027కి పక్కా ఫ్యామిలీ ట్రీట్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.