బోయపాటి శ్రీనివాస్ ,బాలకృష్ణ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది.ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఈషెడ్యూల్ తో సగానికిపైగా షూటింగ్ పూర్తయినట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇంతకుముందే ప్రకటించారు.దసరా టార్గెట్ గా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు.అయితే ఈ డేట్ మారనుందని టాక్.అదే డేట్ కి పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రానుంది.రీసెంట్ గానే రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఓజీ పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.దాంతో పోటీ ఎందుకని సోలో రిలీజ్ ఉంటే బెటర్ అని అఖండ 2 మేకర్స్ అనుకుంటున్నారట.సో డిసెంబర్ ఫస్ వీక్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.ఈనెల 10నబాలకృష్ణ బర్త్ డే ఉండడంతో ఆరోజు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఆ టీజర్ లో రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది.
ఇందులో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.అఖండ 2 పాన్ ఇండియా కానుండడం తో నార్త్ ఆడియెన్స్ కు కూడా నచ్చేలా రూపొందిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























