యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ తెలుసు కదా అనే సినిమా తో రానున్నాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నీరజ కోనా డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకున్న నీరజ ఈసినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో రాశి కన్నా ,నిధి శెట్టి హీరోయిన్లు గా నటిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వస్తుంది.షూటింగ్ కూడా సగానికి పైగా కంప్లీట్ చేసుకుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దీపావళికి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి ఈరిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఇక టిల్లు ,టిల్లు స్క్వేర్ లతో కెరీర్ లో వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టి యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్దు.అయితే హ్యాట్రిక్ కొడదామనుకున్న తనకు జాక్ కొంచెం క్రాక్ షాక్ ఇచ్చింది.రీసెంట్ గా రిలీజైన ఈసినిమా సరైన ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది.దాంతో సిద్దు ,తెలుసు కదాతో బ్లాక్ బస్టర్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























