కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

తెలుగు ఇండస్ట్రీలో 'GOAT' బాలయ్య గారు - డైరెక్టర్ వెంకట్ ప్రభు

Director Venkat Prabhu Compares Nandamuri Balakrishna is A GOAT in Tollywood

తెలుగు ఇండస్ట్రీలో 'GOAT' బాలయ్య గారు - డైరెక్టర్ వెంకట్ ప్రభు

Director Venkat Prabhu Compares Nandamuri Balakrishna is A GOAT in Tollywood

Director Venkat Prabhu Compares Nandamuri Balakrishna is A GOAT in Tollywood

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'The GOAT' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. 'The GOAT' సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. The GOAT మూవీ హోల్సమ్ ఎంటర్ టైనర్. థియేటర్స్ లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. దళపతి విజయ్ ని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాం. సెప్టెంబర్ 5న థియేటర్స్ లో సినిమా చూసి ఎలా వుందో చెప్పండి. విజయ్ గారు, ప్రశాంత్, ప్రభుదేవ, జయరాం ఇలా ఎంతోమంది బిగ్ స్టార్స్ తో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. అలాగే స్నేహ, లైలా, మీనాక్షి, యోగిబాబు, ప్రేమ్ జీ ఇలా హ్యుజ్ స్టార్ కాస్ట్ వున్న సినిమా ఇది" అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. "విజయ్ గారి సినిమా, అలాగే ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ 25వ సినిమాని డైరెక్టర్ చేయడం ఆనందంగా వుంది. ఏడాదిలో ఈ సినిమా చేశాం. ఇదే సినిమా హాలీవుడ్ లో చేస్తే చాలా టైం, బడ్జెట్ తీసుకుంటారు. ఇలా చేయడానికి రాజమౌళి గారే స్ఫూర్తి. ఆయనకి పెద్ద ఫ్యాన్. మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్ యూ. వారు ఈ సినిమాని రిలీజ్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. సెప్టెంబర్ 5న సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. బాలయ్య గారు సినీ పరిశ్రమలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. ఆయనకి మనస్పూర్తిగా శుభాకాంక్షలు. జై బాలయ్య. తెలుగు ఇండస్ట్రీలో 'GOAT' బాలయ్య గారు" అని అన్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్