కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

చాలా రోజుల తర్వాత నా సినిమా వస్తోంది, అదిరిపోతుంది

Actress Sneha Excited For Acting in GOAT with Thalapathy Vijay

చాలా రోజుల తర్వాత నా సినిమా వస్తోంది, అదిరిపోతుంది

Actress Sneha Excited For Acting in GOAT with Thalapathy Vijay

Actress Sneha Excited For Acting in GOAT with Thalapathy Vijay

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

'The GOAT' సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ స్నేహ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ గారు, వెంకట్ ప్రభు గారు, అర్చన గారికి థాంక్ యూ. ఇదొక మెగా ఫిల్మ్. సెట్స్ లో విజయ్, ప్రశాంత్, లైలా, మీనాక్షి ఇలా ఎందరో స్టార్స్ వుండేవారు. ఈ అందరితో పని చేయడం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చాలా రోజుల తర్వాత నా సినిమా వస్తోంది. సినిమా అదిరిపోతుంది" అని అన్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్