ఎలాంటి సినిమా నేపథ్యంలేని కుటుంబం నుండి వచ్చి.. ఎంతో కష్టపడి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ మొదట్లో ఏ పాత్ర వచ్చినా కాదనకుండా చేసుకుంటూ వెళ్లాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ మెగాస్టార్ అనే స్థాయికి ఎదిగారు. అప్పటి వరకూ చిరులాగ డ్యాన్స్ చేసేవాళ్లు లేకపోవడంతో ఆయన డ్యాన్స్ కు, స్టైల్ కు అప్పట్లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. ఇప్పటికి కూడా అదే క్రేజ్ ఉందనుకోండి. ఇక ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో రికార్డులు పగలకొట్టారు, ఎన్నో అవార్డులు అందుకున్నారు.. ఎంతో పేరును సొంతం చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే మెగాస్టార్ కు అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే కదా. గత రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే మెగాస్టార్ కు పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. దీనిలో భాగంగానే నేడు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇక అవార్డును అందుకోవడానికి చిరు నిన్ననే ఢిల్లీకి వచ్చేశారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























