ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా వారం రోజులు థియేటర్లలో ఆడిందంటే గొప్ప విషయంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ మన తెలుగు సినిమాలకు కాస్త పూర్వ వైభవం వస్తున్నట్టు కనిపిస్తుంది. ఈమధ్య కొన్ని సినిమాలు 25 రోజులు50 రోజులు పూర్తి చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రన్ తో దూసుకుపోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మేకర్స్ మంచి లాభాలను అందించింది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు 70 సెంటర్స్ లో వాల్తేరు వీరయ్య మూవీ 50 రోజులు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొని రన్ అవుతుంది. ఈ మేరకు చిత్రయూనిట్ కూడా ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. మరి చాలా కాలం తరువాత చిరు ఈసినిమాతో తన మార్క్ హిట్ ని అందుకున్నారని చెప్పొచ్చు.
Celebrating 50 days of MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🥳🎉#50DaysofWaltairVeerayya 🔥
MEGASTAR @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/tK9sB8nppl
— Mythri Movie Makers (@MythriOfficial) March 3, 2023
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇంకా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: