యూ ఎస్ లో భారీ స్థాయి లో రిలీజ్ కానున్న దసరా

Dasara Movie All Set For Grand Release In US And Overseas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,Dasara Movie Update,Dasara Movie Latest Updates,Dasara Movie Latest Update,Dasara Latest Update,Dasara Latest Updates,Dasara Telugu Movie Latest Updates,Dasara Movie News,Dasara Telugu Movie Latest News,Dasara Movie Latest News,Dasara Movie Grand Release In US And Overseas,Dasara Movie Grand Release In US,Dasara Release Date,Dasara Movie Release Date,Dasara Movie Release Updates

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా మూవీలో హీరో నాని రోజు వారీ కూలీ ధరణి పాత్రలో పక్కా మాస్ అవతారంలో కనిపించనున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తానా, సెకండ్ సింగిల్ ఓరి వారి లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. దసరా మూవీలో నాని తెలంగాణ స్లాంగ్ సంభాషణలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం.దసరా మూవీని యూ ఎస్ లో భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఈ మూవీని యూ ఎస్ లో ప్రత్యంగిరా సినిమాస్ వారు రిలీజ్ చేయనున్నారు. అలానే ప్రీమియర్స్ ని మార్చి 29న గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. నాని కెరీర్ లో దసరా మూవీ అక్కడ భారీ ఎత్తున రిలీజ్ అవుతుందని, మరోవైపు ఇటీవల మంచి కంటెంట్ తో రిలీజ్ అయిన పలు సినిమాలు యూ ఎస్ లో బాగా పెర్ఫర్మ్ చేయడంతో, ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీ కూడా తప్పకుండా యుఎస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 6 =