హైప్ పెంచుతున్న కబ్జా

Kabzaa Movie Makers Increasing Hype In Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kabzaa,Kabzaa Movie,Kabzaa Telugu Movie,Kabzaa Movie Updates,Kabzaa Movie Latest News,Kabzaa Makers Increasing Hype,Kabzaa Movie Makers Increasing Hype,Kabzaa Movie Makers,Kabzaa Movie News,Kabzaa Update,Kabzaa Movie Latest Update,Kabzaa Makers,Kabzaa Trailer Launch,Upendra,Kiccha Sudeep,Upendra Movies,Upendra New Movie,Upendra Latest Movie,Upendra Kabzaa,Upendra Kabzaa Movie,Upendra Kabzaa Movie Updates

డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర కే సాధ్యం. తను చేసే సినిమాలు అన్నీ దాదాపు విభిన్నంగానే ఉంటాయి. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా కబ్జా. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాను తెలుగులో టాలీవుడ్ హీరో కమ్ నిర్మాత అయన నితిన్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ బ్యానర్ పై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసినిమాకు మంచి హైప్ ను పెంచే కార్యక్రమాల్లో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ మూవీ నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉపేంద్ర కు మంచి క్రేజ్ ఉండడంతో దీనిని తెలుగులో కూడా గ్రాండ్ గా ప్రమోట్ చేయాలని యూనిట్ ఆలోచన చేస్తోందట. మరి ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ ద్వారా ఉపేంద్ర ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.

కాగా ఈసినిమాలో మరో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా నటిస్తున్నాడు. ఇంకా శ్రియా శరణ్, బొమన్ ఇరానీ, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠి, బెంగాలీ మొత్తం ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మార్చి 17న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ గా ఈసినిమా రిలీజ్‌ అవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + seven =