మ్యూజికల్ హిట్ గంగోత్రి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప:ది రూల్ మూవీ లో నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అల్లు అర్జున్ తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ ఇన్స్టా గ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ చేరుకున్నారు. కాగా సౌత్ ఇండియన్ స్టార్స్ లో ఇంత భారీ స్థాయి ఫాలోవర్లు కలిగిన ఏకైక స్టార్ గా అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ లో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్నారు. దీనితో పలువురు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: