ఆస్కార్ అవార్డ్స్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్

Singers Rahul Sipligunj And Kaala Bhairava To Perform Naatu Naatu Live At Oscars,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rahul Sipligunj New Movie,Rahul Sipligunj Movies,Rahul Sipligunj Upcoming Movie,Rahul Sipligunj Latest Movie,Kaala Bhairava Movie Updates,Kaala Bhairava Latest Movie News,Kaala Bhairava New Movie Update,Kaala Bhairava Latest Movie Update,Rahul Sipligunj And Kaala Bhairava Perform Naatu Naatu Live At Oscars, In Oscars Naatu Naatu Perform By Singers Rahul Sipligunj And Kaala Bhairava,Rahul Sipligunj Perform Naatu Naatu In Oscars

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 12న జరిగే 95వ అకాడమీ అవార్డ్స్ లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారని అకాడమీ ట్వీట్ చేసింది.సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవకి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − one =