కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

రిలీజ్ అయిన నాని దసరా మూవీ ఓరి వారి సాంగ్ మేకింగ్ వీడియో

Ori Vaari Song Making Video From Nani Dasara Movie Out Now,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Dasara Movie,Dasara,Dasara Movie Telugu Movie,Dasara Movie Movie Updates,Dasara Movie Mo
సాంగ్1 ని. చదువు

రిలీజ్ అయిన నాని దసరా మూవీ ఓరి వారి సాంగ్ మేకింగ్ వీడియో

Ori Vaari Song Making Video from Nani Dasara Movie Out Now

Ori Vaari Song Making Video From Nani Dasara Movie Out Now,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Dasara Movie,Dasara,Dasara Movie Telugu Movie,Dasara Movie Movie Updates,Dasara Movie Mo

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దసరా మూవీలో హీరో నాని రోజు వారీ కూలీ ధరణి పాత్రలో నటించారు. ఆ పాత్రకు తగ్గట్టుగా నాని తనను తీర్చిదిద్దుకున్నారు. ఈ మూవీలో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో పక్కా మాస్ అవతారంలో నాని కనిపించనున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తానా, సెకండ్ సింగిల్ ఓరి వారి లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ ఓరి వారి సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దసరా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్