వారిని బట్టే డైలాగ్స్, సాంగ్స్ రాస్తాను

Director Sukumar About His Movie Dialogues And Songs,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Sukumar New Movie,Sukumar Movies,Sukumar Upcoming Movie,Sukumar Latest Movie,Sukumar Movie Updates,Sukumar Latest Movie News,Sukumar New Movie Update,Sukumar Latest Movie Update,Sukumar,Director Sukumar,Sukumar Inteview,Sukumar Latest Interview,Sukumar About His Upcoming Movies, Sukumar About His Movie Dialouges, Sukumar About His Movie Songs

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్య సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్ ఆ సినిమాతో కొత్త ట్రెండ్ ను సృష్టించాడు. ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు తప్పా తను తీసిన సినిమాలు అన్నీ దాదాపు విజయాలనే సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా తన సినిమాల్లో ఉండే లాజిల్స్ అలానే డైలాగ్స్ ఇంకా సాంగ్స్ అన్నీ ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతాయి. ఆర్య, ఆర్య 2, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప పార్ట్ 1 ఇలా అన్నీ వేటికవే డిఫరెంట్ కాన్సెప్ట్ లు. అందుకే బాక్సాఫీస్ వద్ద హిట్ ను సొంతం చేసుకున్నాయి. ఇక రీసెంట్ గానే సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో పాటలు కానీ డైలాగ్స్ కానీ ఎంత హిట్ అయ్యాయో చూశాం. సోషల్ మీడియాలో కూడా ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న సుకుమార్ తన సినిమాల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. తన సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ రాసేటప్పుడు సోషల్ మీడియా ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని రాస్తానని తెలియచేశారు. మనం రాసే డైలాగ్స్ సోషల్ మీడియా ఆడియన్స్ ని ప్రభావితం చేస్తాయని.. తన లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్ లో సాంగ్స్, డైలాగ్స్ భారీ స్థాయిలో ఇన్స్టా రీల్స్, షార్ట్స్ రూపంలో వచ్చాయని ఆ విధంగా సినిమాకి మరింత క్రేజ్ లభించిందని తెలిపారు.

ప్రస్తుతం అయితే సుకుమార్ పుష్ప పార్ట్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =