పార్లమెంట్ లో సూపర్ స్టార్ కు నివాళి

Parliament Mourns Superstar Krishnas Demise, Superstar Krishnas Demise, Parliament Mourns, Krishnas Demise, Superstar Krishna, Krishna Latest Movie, Krishna Upcoming Movie, Krishna Movies, Parliament, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

అలనాటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే కదా. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈమధ్య మరణించారు ప్రస్తుతం అయితే మహేష్ కుటుంబం ఆ బాధనుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పార్లమెంట్ లో సూపర్ స్టార్ కు నివాళి అర్పించారు సభ్యులు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆనవాయితీ ప్రకారం సమావేశాలకు ముందు చనిపోయిన మాజీ ఎంపీలకు వారి పేర్లు, వివరాలు చదివి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ కు నివాళులు అర్పించారు. నటుడిగా , పార్లమెంట్‌ సభ్యుడిగా కృష్ణ ఎన్నో దశాబ్దాల పాటు ప్రజా సేవ చేశారని.. తెలుగు సినిమారంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెబుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఆ రోజుల్లోనే టెక్నాలజీని పరిచయం చేసిన ఏకైక హీరో కృష్ణ. మొదటగా పలు నాటకల్లో నటించిన ఆయన ఆ తరువాత పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక తేనెమనసులు సినిమాతో నటుడిగా అందరి ప్రశంసలందుకున్నారు కృష్ణ. తొలి చిత్రం సాధించిన విజయంతో కృష్ణ వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఇక తన సినీ ప్రయాణంలో 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − nine =