ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల హవా ఎంత పెరిగిపోయిందో చూస్తున్నాం. రీసెంట్ గా వచ్చిన కాంతార సినిమా మరోసారి సౌత్ సినిమా సత్తా చూపించింది. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. దాంతో హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు పలు భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాను గత కొన్ని రోజులుగా ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ అవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను ఇంగ్లీష్ లో కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చెయ్యనున్నారట. వచ్చే ఏడాది జనవరి లోనే ఈసినిమా రిలీజ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: