ఆదిపురుష్ హిందీ వెర్షన్ ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ ప్రారంభం
Adipurush Movie Hindi Dubbing Works Begin

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ కానుంది.
అక్టోబర్ 2వ తేదీ అయోధ్యలో ఆదిపురుష్ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో అన్ని భాషలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఆదిపురుష్ మూవీ హిందీ టీజర్ ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా యూట్యూబ్‌లో ఈ టీజర్ పదికోట్ల వ్యూస్ రాబట్టింది.బాహుబలి , బాహుబలి 2 మూవీస్ లో ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన హిందీ , మరాఠి చిత్ర నటుడు శరద్ కేల్కర్ ఇప్పుడు ఆదిపురుష్ హిందీ వెర్షన్ ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ ప్రారంభించినట్టుగా వెల్లడించారు. రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కు మరోసారి డబ్బింగ్ చెప్పడం సంతోషంగా ఉందని చెప్పారు.సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ తో శరద్ కేల్కర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.








