
ట్యాగ్ · 2 కథనాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించాలని ఉంది - పాయల్ రాజ్ పుత్
బ్లాక్ బస్టర్ బాహుబలి, బాహుబలి 2 మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ సాహో మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ పెంపొందించుకున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న అన్ని మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

ఆదిపురుష్ హిందీ వెర్షన్ ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ ప్రారంభం
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…