టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు .హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
We are announcing the new release date of our upcoming movie ‘Adipurush’! #Adipurush on 16th June, 2023!#Prabhas @omraut #SaifAliKhan @mesunnysingh #Pramod #Vamsi #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @UV_Creations pic.twitter.com/MaOK8aN2Wt
— UV Creations (@UV_Creations) November 7, 2022
అక్టోబర్ 2వ తేదీ అయోధ్యలో ఆదిపురుష్ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మరింత విజువల్ వండర్ గా ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించడానికి మరో సుమారు 100 కోట్లు ఖర్జు పెట్టడానికి మేకర్స్ సిద్ధం అయ్యారు. అందువలన ఆదిపురుష్ మూవీ ని 2023 జూన్ 16 వతేదీ రిలీజ్ కానున్నట్టు యు వి క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆదిపురుష్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























