
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
ఊర్వశివో రాక్షసివో బన్నీ అతిథిగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
మొత్తానికి చాలా గ్యాప్ తరువాత వచ్చిన అల్లు శిరీష్ కు మంచి హిట్ దక్కింది. అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నిన్న ఒక్క రోజే అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవ్వగా ఆ పోటీని తట్టుకొని ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. శిరీష్ నటన, అను గ్లామర్ తో పాటు యాక్టింగి, కామెడీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఇవన్నీ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి.