పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్అయ్యింది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. లైగర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ తమ నష్టాలను భరించాలని పూరి జగన్నాథ్ ను బెదిరిస్తున్నారు. దీనిపై పూరీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ వివాదం నేపథ్యంలో పూరీ ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయం, అపజయం, జీవితం శాశ్వతం కాదనీ , ప్రతి సంఘటనని మనం అనుభవంలానే చూడాలనీ , లైఫ్ లో రిస్క్ చెయ్యకపోతే అది జీవితమే కాదనీ ,తన మీద నమ్మకంతో టికెట్ కొని సినిమాకు వచ్చిన ప్రేక్షకులను తప్పితే తాను ఎవ్వరినీ మోసం చేయలేదనీ , మళ్లీ ఇంకో సినిమా తీస్తాననీ , కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాననీ , జీవితంలో చివరగా అందరూ కలిసేది శ్మశానంలోనే అనీ , మధ్యలో జరిగేది అంతా డ్రామా అనీ జీవిత సత్యం వివరిస్తూ పూరి జగన్నాథ్ ఆ లేఖ లో వ్రాశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: