అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ ఈ రోజు (అక్టోబర్ 21 వ తేదీ) రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పలు కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విష్ణు మంచు తన కామెడీ తో మరోసారి అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you my darling brother #Prabhas!!!! This is genuinely a surprise to me. Much love ❤️ #Ginna pic.twitter.com/QwRAWXZcOL
— Vishnu Manchu (@iVishnuManchu) October 20, 2022
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో జిన్నా మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆల్ ది బెస్ట్ మై డియర్ బ్రదర్ మంచు విష్ణు. జిన్నా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాననీ , ఈ సినిమాతో నీకు మంచి ఫలితం అందాలని ఆశిస్తున్నాననీ , రిలీజ్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ ఉందనీ ప్రభాస్ పోస్ట్ పెట్టారు.ఇందుకు మంచు విష్ణు కూడా డార్లింగ్ కు రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ మై డార్లింగ్ బ్రదర్ ప్రభాస్, జిన్నాకు మీ మద్దతు ఉండటం తనకు నిజంగా సర్ ప్రైజ్ గా ఉందనీ , లవ్ యూ అంటూ ధన్యవాదాలు తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: