అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలు కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విష్ణు మంచు తన కామెడీ తో మరోసారి అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జిన్నా మూవీ రిలీజ్ సందర్భంగా పాయల్ మీడియా సమావేశంలో తన పాత్ర, మూవీ గురించి మాట్లాడుతూ .. ఈ మూవీ లో పచ్చళ్లు అమ్ముకునే గ్రామీణ యువతి స్వాతి పాత్రలో నటించాననీ , ఈ పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్, డిక్షన్ మార్చుకోవడం తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందనీ , డైరెక్టర్‌ఇషాన్ , రైటర్ కోన వెంకట్ సాయంతో తన పాత్రను బ్యాలెన్స్ చేయగలిగాననీ , సన్నీలియోన్ తో స్క్రీన్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉందనీ , పక్కా మసాలా-కామెడీ ఎంటర్‌టైనర్‌గా జిన్నా మూవీ ని దర్శకుడు ఇషాన్ తెరకెక్కించారనీ , ఫన్ డ్రామా కలయికతో జిన్నా థ్రిల్ అందించడం ఖాయం అనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: