ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అక్కినేని హీరోలు

Naga Chaitanya and Akhil to Grace the Ghost Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Tollywood Movie Updates,Tollywood Latest News,Nagarjuna,Naga Chaitanya,Akhil,Ghost Pre Release Event,Ghost Movie Pre Release Event,Ghost Telugu Movie Pre Release Event,Ghost Pre Release Event Chief Guests,Ghost Movie Pre Release Event Chief Guests Confirmed,Ghost,Ghost Movie,Ghost Telugu Movie,Ghost Movie Live Updates,Ghost Telugu Movie Latest News

అగ్రహీరో నాగార్జున కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే బంగార్రాజు, బ్రహ్మాస్త్ర సినిమాలతో మంచి హిట్లను తన ఖాతాలో వేసుకున్న నాగార్జున ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ‘గరుడ వేగ’ తరువాత ప్రవీణ్ సత్తారు నుంచి వస్తున్న సినిమా కావడంతో, అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇప్పటికే కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా యూనిట్ ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది. అదేమిటంటే ఈవెంట్ కి నాగార్జున ఇద్దరు కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ముఖ్యఅతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు. దీంతో అక్కినేని ఫ్యామిలీ అంతా ఒకే స్టేజి మీదకు రాబోతుండడంతో అక్కినేని అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్‌, అనిఖ సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 12 =