
ట్యాగ్ · 2 కథనాలు

ఐఫా ఉత్సవం అవార్డ్స్.. నామినేషన్స్‌లో శాండల్‌వుడ్ స్టార్ హీరోలు
ఇండియన్ సౌత్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించిన ప్రతిష్టాత్మక వేదిక 'ఐఫా ఉత్సవం' (IIFA) వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఈ యేడాది తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం పరిశ్రమలకు చెందిన అత్యుత్తమ చిత్రాలకు అవార్డు ప్రెజెంటేషన్లు అందించనుంది. ఇక వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ గాలా కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశం సిద్ధమవుతోంది.

ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అక్కినేని హీరోలు
అగ్రహీరో నాగార్జున కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే బంగార్రాజు, బ్రహ్మాస్త్ర సినిమాలతో మంచి హిట్లను తన ఖాతాలో వేసుకున్న నాగార్జున ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. 'గరుడ వేగ' తరువాత ప్రవీణ్ సత్తారు నుంచి వస్తున్న సినిమా కావడంతో, అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.