యూఎస్ లో సీతారామం డబుల్ బ్లాక్ బస్టర్

Sita Ramam turns out as blockbuster in USA,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Latest Updates,Sita Ramam Movie Collections in USA,Sita Ramam Movie In USA,Sita Ramam Movie BlockBuster Hit in USA,Sita Ramam Movie Response in USA,Sita Ramam Movie latest Updates,Sita Ramam Movie Latest Response in USA,Sita Ramam Latest Updates From USA,Dulquer Salmaan,Dulquer Salmaan Latest Blockbuster Movie in USA

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సీతారామం. టైటిల్ కు తగ్గట్టుగానే సీతారాముల మధ్య ఉన్న ప్రేమ వీరిద్దరిలో కనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ ఈసినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఈసినిమా. ఫీల్ గుడ్ మూవీగా రిలీజ్ అయిన ఈ ప్రేమ కథకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈసినిమాను సౌత్ లాంగ్వేజస్ లో రిలీజ్ చేశారు. ఇక్కడ ఈసినిమా సూపర్ సక్సెస్ అయి మంచి కలెక్షన్స్ కూడా రాబట్టుకుంది. ఇక ఈసినిమాను ఇప్పుడు నార్త్ లో కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు ఓవర్సీస్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాదు అక్కడ కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటి వరకూ సీతారామం సినిమా యూఎస్ లో 1.35 మిలియన్ డాలర్స్ ను మించికలెక్షన్స్ ను రాబట్టుకుంది. 7 లక్షల డాలర్స్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది.ఇంతవరకూ ఈ సినిమా అక్కడ 1.35 మిలియన్ ప్లస్ డాలర్స్ ను రాబట్టుకుంది. త్వరలోనే 1.5 మిలియన్ మార్కును టచ్ చేయవచ్చని అంటున్నారు. అంతాలా అక్కడ సీతారామం సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

కాగా ఈసినిమాను వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =