కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

'కార్తికేయ2' ప్రమోషన్స్ పై అనుపమ క్లారిటీ..!

Anupama Clarifies about not being part of Karthikeya 2 Promotions, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Karthikeya 2 Promotions, Karthikeya 2 Movie Promo

'కార్తికేయ2' ప్రమోషన్స్ పై అనుపమ క్లారిటీ..!

E0 B0 95 E0 B0 Be E0 B0 B0 E0 B1 8d E0 B0 A4 E0 B0 Bf E0 B0 95 E0 B1 87 E0 B0 Af2 E0 B0 Aa E0 B1 8d E0 B0 B0 E0 B0 Ae E0 B1 8b E0 B0 B7 E0 B0 A8 E0 B1 8d E0 B0 B8 E0 B1 8d E0 B0 Aa E0 B1 88

Anupama Clarifies about not being part of Karthikeya 2 Promotions, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Karthikeya 2 Promotions, Karthikeya 2 Movie Promo

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా కార్తికేయ2. ఈసినిమా సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. అయితే కార్తికేయ సినిమాను సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నేపథ్యంలో రూపొందించగా. ఈసీక్వెల్ ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యం నేపథ్యంలో తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈసినిమా అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 12వ తేదిన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ లో అనుపమ కనిపంచకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక దీనిపై అనుపమ తొందరగానే స్పందించి క్లారిటీ ఇచ్చింది. తన ఇన్స్టా వేదికగా ఒక పోస్టే చేసింది. అందులో అనుపమ నేను కార్తికేయ 2 ప్రమోషన్స్ లో ఎందుకు పాల్గొనట్లేదో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను.. నేను మరో రెండు సినిమాలు చేస్తున్నాను ఆసినిమాల షూటింగ్ కోసం రాత్రి, పగలు పనిచేస్తున్నాను.. ఈ డేట్స్ ఎప్పుడో బుక్ అయినవే.. కార్తికేయ2 సినిమా రిలీజ్ డేట్ లో చాలా మార్పులు రావడంతో లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కాస్త కష్టంగా ఉంది.. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.. ఇక ఈసినిమాకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టిన నా చిత్రయూనిట్.. ముఖ్యంగా నిఖిల్.. చాలా ఎఫర్ట్స్ పెట్టారు.. అందరికీ లాట్స్ ఆఫ్ లవ్ అంటూ పోస్ట్ లో పేర్కొంది.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా... ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్