100 డేస్ కంప్లీట్ చేసుకున్న "కె జి ఎఫ్ చాప్టర్ 2"
100 E0 B0 A1 E0 B1 87 E0 B0 B8 E0 B1 8d E0 B0 95 E0 B0 82 E0 B0 Aa E0 B1 8d E0 B0 B2 E0 B1 80 E0 B0 9f E0 B1 8d E0 B0 9a E0 B1 87 E0 B0 B8 E0 B1 81 E0 B0 95 E0 B1 81 E0 B0 A8 E0 B1 8d E0 B0 A8

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ నిధి శెట్టి కథానాయిక . రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందిం ది. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1240 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
తాజాగా "కె జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ 100 డేస్ ను కంప్లీట్ చేసుకుంది. "కె జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పార్ట్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని వైరల్ గా మారింది.







