రాహుల్ విజయ్-మేఘా ఆకాష్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!

Rahul Vijay And Megha Akash New Movie Title Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rahul Vijay And Megha Akash Movie,Rahul Vijay And Megha Akash Telugu Movie,Rahul Vijay And Megha Akash Upcoming Movies,Rahul Vijay And Megha Akash New Movie Title Out Now, Rahul Vijay And Megha Akash Movie Title Released,Rahul Vijay And Megha Akash Movie Latest Title Revealed,Rahul Vijay And Megha Akash Upcoming Movie Title Released

రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మన్యు బద్ది దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ గోవాలో చిత్రీకరించగా.. ఇప్పటికే చాలావరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తాజాగా టైటిల్ ను ఫిక్స్ చేసుకుంది. మరి ఈ సినిమాకి “మాటే మంత్రము” అనే టైటిల్ ను ఖరారు చేశారు. నేడు రాహుల్ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈసినిమాను మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తుండగా.. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు.ఇంకా ఈసినిమాలో రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్ మరో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సుశాంత్ రెడ్డి కథను అందిస్తుండగా హరి గౌర సంగీతం అందిస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా ప్రవీణ్ ఎడిటర్ గా చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seventeen =