పవన్ స్వాగ్ ఇష్టం.. ప్రభాస్ నా ఫేవరేట్..!

Ranbir Kapoor about Prabhas and Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ranbir Kapoor,Hero Ranbir Kapoor,Bollywood Star Ranbir Kapoor,Bollywood Hero Ranbir Kapoor,Ranbir Kapoor About Prabhas and Pawan kalyan,Ranbir Kapoor in Promotions of Brahmastra Movie, Brahmastra Pre Release Event at Vizag,Ranbir Kapoor at Vizag For Promotion of Brahmastra movie,Ranbir kapoor about pawan kalyan and prabhas in Brahmastra Pre Release Event, Ranbir Kkapoor says Prabhas and Pawan Kalyan Are My favourite

పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని సినీ ఇండస్ట్రీల మధ్య అలానే నటీ నటుల మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. అలానే ఆడియన్స్ కూడా భాషాభ్రియాలు లేకుండా నార్త్, సౌత్ అని లేకుండా ఏ సినిమా అయినా సరే చూస్తున్నారు. మన సౌత్ సినిమాలు హిందీలో బ్లాక్ బస్టర్ అవుతున్నాయంటే దానికి కారణం ఇదే. అంతేకాదు ఒకప్పటిలాగ కాకుండా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి మనవాళ్లు హిందీకి వెళుతున్నారు.. అక్కడి వాళ్లు ఇక్కడికి వస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే ఇప్పుడు బ్రహ్మాస్త్ర టీమ్ తెలుగు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సౌత్ లో ఈసినిమా రిలీజ్ బాధ్యతలు రాజమౌళి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ వచ్చారు. ఈ ఈవెంట్ లో రణ్ బీర్ తో పాటు అయాన్ ముఖర్జీ, రాజమౌళి కూడా పాల్గొననున్నారు. ముందు సింహాచలం ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆతరువాత మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా రణబీర్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇక ఇదే ఈవెంట్ లో సౌత్ సినిమాల్లో మీకు నచ్చిన ఒక విషయం గురించి చెప్పమని అడుగగా.. సౌత్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని.. కమల్ హాసన్, రజనీ కాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ బాగా చేస్తారు.. పవన్ కళ్యాణ్ స్వాగ్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. ఇంకా రామ్ చరణ్ నా ఫ్రెండే అని చెప్పుకొచ్చారు. అంతేకాదు సౌత్ హీరోల్లో ఫేవరెట్ హీరో ఎవరని అడుగగా.. డార్లింగ్ ప్రభాస్ అంటే ఇష్టమని.. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా అని చెప్పుకొచ్చాడు రణబీర్.

ఇక ఈసినిమాను ఎప్పుడో రిలీజ్ చేయాలనుకున్నారు. ముందు 2019 క్రిస్మస్ అనుకున్నారు.. ఆ తర్వాత 2020 సమ్మర్ కు వాయిదా వేశారు. ఆ తరువాత కరోనా పరిస్థితుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఫైనల్ గా 2022 సెప్టెంబరు 9న ఫిక్స్ చేశారు. అయితే మూడు పార్ట్ లుగా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. మొదటి పార్ట్ బ్రహ్మాస్త్ర.. శివ సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ తో పాటు టాలీవుడ్ అగ్రహీరో నాగార్దున కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =