‘కాఫీ విత్ కరణ్’ సెట్ లో లైగర్ సందడి..!

vijay deverakonda and ananya panday on koffee with karan sets,Liger Pair Vijay Deverakonda And Ananya Panday On Koffee With Karan Sets,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Updates,Liger Movie latest Updates,Liger Upcoming Movie Updates,Liger Movie pair,Liger Movie pair Vijay Deverakonda and Ananya Panday, Koffee with Karan,Vijay Deverakonda And Ananya Panday On Koffee With Karan Sets,Vijay Deverakonda And Ananya Panday On Koffee With Karan Show,Vijay Deverakonda And Ananya Panday On The Sets of Koffee With Karan

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ– స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో మరోపక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, అలానే హంట్ థీమ్ అంటూ రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విజయ్ దేవరకొండకు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డితోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. దానికి తోడు లైగర్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తుండటం.. ఈసినిమాకు కరణ్ జోహర్ కూడా ఒక నిర్మాతగా ఉండటంతో బాలీవుడ్ కు మరింత దగ్గరయ్యాడు. మరి కరణ్ జోహర్ దృష్టిలో పడితే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. బాలీవుడ్ లో స్పెషల్ ట్రీట్ మెంట్ ఉంటుంది. ఇక రీసెంట్ గానే కరణ్ బర్త్ డే వేడుకలకు కూడా విజయ్ కు స్పెషల్ ఇన్విటేషన్ అందింది. ఇక ఇప్పుడు మరో ఘనత సాధించాడు లైగర్. కరణ్ జోహార్ హోస్ట్ గా `కాఫీ విత్‌ కరణ్‌` టాక్‌ షో ఎప్పటినుండో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈషో లో విజయ్ దేవరకొండ, అనన్య ఇద్దరూ పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈషోలో విజయ్ అలానే అనన్య ఇద్దరూ జగ్ జగ్ జియో అనే పాట హుక్ స్టెప్ ను వేశారు. ఇక ఈ వీడియోను అనన్య తన ఇన్స్టా ద్వారా షేర్ చేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 18 =