అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్3. ఈసినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎఫ్ 2 సినిమా ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ఈసినిమా కూడా అదే రేంజ్ లో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండి కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ ఇంకా మిగిలిన నటీనటులు అందరూ కలిసి చేసిన సందడికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసినిమా బాగా కనెక్ట్ అవుడుండటంతో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఎఫ్3 సినిమాకు రోజురోజుకు వసూళ్లు పెరగడానికి ఇదే కారణం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా మంచి వసూళ్లనే రాబడుతుంది. ఇక చిత్రయూనిట్ కూడా ఈసినిమా మూడు రోజుల కలెక్షన్స్ ను అధికారికంగా తెలియచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 63 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్లోనూ ఎఫ్3 అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు ఇప్పటివరకు 7 లక్షలకు పైగా డాలర్ల వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఇది మిలియన్ మార్క్ క్రాస్ చేస్తుందంటున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: