‘అంటే సుందరానికి’.. లీలా కోసం నజ్రియా డబ్బింగ్

Nazriya Dubbing Video for Ante Sundaraniki Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Movie Updates,Ante Sundaraniki Telugu Movie Latest News,Ante Sundaraniki: Nazriya Aka Leela Is Dubbing In Telugu For The First Time,Ante Sundaraniki: Nazriya Nazim dubs for Leela Thomas in Telugu from Nani starrer,Ante Sundaraniki: Nazriya Nazim dubs for Leela Thomas in Telugu from Nani starrer,Super Cute Nazriya Doing Her Best In Telugu Dubbing,Nazriya,Nani

తన సహజ నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని. మొదటి నుండి నాని చేసే సినిమాలు మినిమం గ్యారెంటీ సినిమాలు గానే ఉన్నాయి. అప్పుడప్పుడు పరాజయాలు చూసినా నాని సక్సెస్ రేటు మాత్రం ఎక్కువే. ప్రస్తుతం నాని విభిన్నమైన కథలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలో రీసెంట్ గా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అంటే సుందరానికి అంటూ మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తాజాగా నజ్రియా కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేసే పనిలో పడింది. అందుకు సంబంధించిన వీడియో ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో లో నజ్రియా ఎక్స్ప్రెషన్స్ ఫ్యాన్స్ ను, ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ చిత్రంలో నానికి జోడీగా న‌జ్రియా హీరోయిన్‌గా న‌టించింది. న‌జ్రియా తెలుగులో న‌టించిన‌ మొద‌టి చిత్రం ఇదే కావ‌డం విశేషం. ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 1 =