
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుంది.. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక ఇలాంటి ప్రశ్నే మెగాస్టార్ చిరంజీవికి ఎదురైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 29వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న చిరంజీవిని సిద్ద పాత్రలో రామ్ చరణ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా ఉంటుంది.. మీకు ఎప్పుడైనా ఆ ఆలోచన వచ్చిందా అని అడుగగా.. చరణ్ ఒప్పుకోకపోతే, కుదరకపోతే వేరే యాక్టర్స్ ఎవ్వరైనా…