అఫీషియల్..యూవీ క్రియేషన్స్ లో ‘కార్తికేయ’

Karthikeya New Movie With UV Creations Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kartikeya,Hero Kartikeya,Kartikeya upcoming Movies,Kartikeya Latest Movie Updates,Kartikeya New Movies,Kartikeya upcoming Movies,Kartikeya upcoming Film,Kartikeya New Movie Announced, Kartikeya New Movie Announced By UV Creations,Kartikeya Upcoming Movie Officially Announced,UV Creations Announced New Movie with kartikeya

ఒకపక్క పెద్ద పెద్ద సినిమాలు.. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరో పక్క చిన్న సినిమాలు తీయడానికి కూడా ముందుకొస్తుంది టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఇటీవలే రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించింది ఈ బ్యానర్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలకు సైతం తమ బ్యానర్ లలో నటించే అవకాశం కల్పిస్తుంది. అంతేకాదు ఈబ్యానర్ నుండి వచ్చే సినిమాలు కూడా దాదాపు మంచి హిట్లే కొడుతుంటాయి. అందుకే యంగ్ హీరోలు కూడా ఈ బ్యానర్ లో చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలోనే తాజాగా మరో యంగ్ హీరో ఈ బ్యానర్ లో నటించే ఛాన్స్ కొట్టేశాడు. ఆ హీరో ఎవరో కాదు కార్తికేయ. కార్తికేయ‌తో ఓ సినిమాను చేయ‌బోతున్న‌ట్లుగా యూవీ క్రియేషన్స్ తాజాగా ప్ర‌క‌టించింది. ప్ర‌శాంత్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మ‌వుతూ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర విష‌యాలు త్వర‌లోనే తెలియచేయనున్నారు.

కాగా ‘ఆర్ఎక్స్100’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తికేయ మొదటిసినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇక ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు. ఇటీవ‌లే వలిమై సినిమాతో కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టగా.. వలిమై ’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ప్రస్తుతం పలు కొత్త సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 1 =