మొత్తానికి అగ్రహీరో నాగార్జున కూాడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే వైల్డ్ డాగ్ తో అలరించగా.. ఆ వెంటనే గ్యాప్ కూడా తీసుకోకుండా మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ రాగా రీసెంట్ గానే మళ్లీ రీస్టార్ట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోవాలో పూర్తవ్వగా.. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది ఓ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక వర్షంలో కత్తి పట్టుకొని ఉన్న నాగ్ ప్రీ లుక్ అయితే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు దీనితో పాటు ఈనెల 29మ మరో అప్ డేట్ ఉన్నట్టు కూడా పోస్టర్ లో తెలిపారు. మరి ఆరోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారేమో చూడాలి.

కాగా ఈసినిమాలో కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి – నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్ – పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























