SR కళ్యాణ మండపం రివ్యూ

Read Through The Movie Review Of SR Kalyanamandapam,SR Kalyanamandapam Telugu Movie Review,Kiran Abbavaram,Priyanka Jawalkar,Sridhar Gade,Telugu Filmnagar,SR Kalyanamandapam Movie Review,SR Kalyanamandapam Movie Songs,SR Kalyanamandapam Movie Trailer,SR Kalyanamandapam Review,SR Kalyanamandapam,SR Kalyanamandapam Movie,SR Kalyanamandapam Telugu Movie,SR Kalyanamandapam Update,SR Kalyanamandapam Telugu Full Movie,SR Kalyanamandapam Movie Live Updates,SR Kalyanamandapam Movie Story,SR Kalyanamandapam Public Talk,SR Kalyanamandapam Movie Public Talk,SR Kalyanamandapam Movie Public Response,SR Kalyanamandapam Telugu Movie Review And Rating,SR Kalyanamandapam Movie Rating,SR Kalyanamandapam Movie Release Updates,SR Kalyanamandapam Review And Rating,Latest Telugu Movie Reviews 2021,SR Kalyanamandapam Rating,SR Kalyanamandapam Telugu Movie Public Talk,SR Kalyanamandapam Latest 2021 Telugu Movie,SR Kalyanamandapam Public Response,Latest Telugu Movie 2021,SR Kalyanamandapam Movie Latest Updates,SR Kalyanamandapam Songs,SR Kalyanamandapam Trailer,Kiran Abbavaram New Movie,Kiran Abbavaram Movies,Kiran Abbavaram SR Kalyanamandapam,Kiran Abbavaram SR Kalyanamandapam Movie,Latest Telugu Reviews,Priyanka Jawalkar Movies,Sai Kumar,#SRKalyanamandapam

‘రాజావారు రాణిగారు’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్‌ అబ్బవరం మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘ఎస్‌. ఆర్‌. కళ్యాణ మండపం’ అంటూ రెండో సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాగా.. అసలు కథ ఎలా ఉందో.. కిరణ్ కు మరో మంచి విజయం దక్కిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయి కుమార్, అనిల్ గీలా, రాజ్ శేఖర్ అనింగి తదితరులు
దర్శకత్వం: శ్రీధర్ గాదె
బ్యానర్: ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: ప్రమోద్, రాజు
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియల్

కథ..

ధర్మ (సాయికుమార్‌) ఎస్‌. ఆర్‌. కళ్యాణ మండపానికి యజమాని. కానీ ఆ కళ్యాణ మండపాన్ని నిర్వహించడానికి నానా తంటాలు పడుతుంటాడు. మండపాన్ని బుక్ చేసుకున్న వాళ్లు ఆఖరి క్షణంలో క్యాన్సిల్ చేసుకుంటు ఉంటారు. దాంతో తాగుడుకు బానిసై ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి తాకట్టు కూడా పెట్టాల్సి వస్తుంది. మరోవైపు ధర్మ కొడుకే కళ్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం). కళ్యాణ్ ఇంజనీరింగ్ చదువుతుంటాడు. అదే కాలేజ్ లో సింధు (ప్రియాంక జవాల్కర్‌) తో ప్రేమలో పడతాడు. సింధుకి మాత్రం కళ్యాణ్ పై ప్రేమ ఉండదు. ఇదిలా ఉండగా పలు కారణాల వల్ల ఎస్. ఆర్‌. కళ్యాణ మండపాన్ని కూడా ధర్మ కోల్పోవాల్సి వస్తుంది. ఆ సమయంలో చదువును కూడా పక్కన పెట్టి కళ్యాణ్‌ కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను భుజానకెత్తుకుంటాడు. మరి ఎస్. ఆర్. కళ్యాణ మండపానికి కళ్యాణ్‌ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడా? ఫైనల్ గా సింధు ప్రేమను ఎలా గెలిచాడు అన్నది కథ.

విశ్లేషణ..

కిరణ్ అబ్బవరం కు ఇది రెండో సినిమా. అయితే తనకి కలిసొచ్చిన విషయం ఏంటంటే ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు తను సమకూర్చుకోవడమే. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు డైలాగ్స్ రాసుకున్నాడు. మొదటి సినిమాలో కంటే ఈసినిమాలో ఇంకాస్త బెటర్ గా నటించాడు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్ పాత్రలో హుషారుగా నటించి ఆకట్టుకున్నాడు. గ్రామానికి వచ్చి తరువాత మాస్ రోల్ లో కూడా చాలా బాగా నటించాడు. ప్రియాంక జవాల్కర్ పాత్ర ఈ సినిమాలో చాలా బాగుంది. అందంతో మాత్రమే కాక అభినయంతో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ నటుడు.. ఇలాంటివి ఎన్నో పాత్రలు చేశాడు కాబట్టి.. ఈ సినిమాలో కూడా తన అద్భుతమైన నటన తో అందరినీ మెప్పించారు. కాలేజీ ప్రిన్సిపాల్ గా భరణి కనిపించేది కొద్దిసేపే అయినా తనదైన శైలిలో మెప్పించారు. ప్రతినాయకుడు పాపారావు పాత్రలో ఎప్పటిలానే శ్రీకాంత్ అయ్యంగార్ తన నటనటో ఆకట్టుకున్నారు. తులసి మరియు అనిల్ గీల కూడా తమ తమ పాత్రలలో బాగానే నటించారు.

ఇక దర్శకుడు శ్రీధర్ గాదె ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎలాంటి లోటు చేయలేదు. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది సినిమా. అటు ప్రేమ కథకు ఇటు ఫ్యామిలీ డ్రామాకు ఒకే విధంగా ప్రాధాన్యతనివ్వడం విశేషం. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్స్ ను బాగా చూపించగలిగాడు. ఇక చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు సంగతి పక్కన పెడితే సినిమాకు బాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మంచి ప్లస్ అయింది.

ఫైనల్ గా చెప్పాలంటే కామెడీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ SR కళ్యాణ మండపం పర్వాలేదనిపిస్తుంది. కాలేజ్ ఏపిసోడ్స్ యూత్ ను బాగానే ఆకట్టుకుంటాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + two =