‘సలార్’ గ్రాండ్ లాంచ్

Prabhas and Director Prashanth Neel Salaar Movie Launch Ceremony Takes Place On A Grand Scale,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Latest Updates,Prabhas,Rebel Star Prabhas,Yash,Rocking Star Yash,Superstar Moment At Salaar,Salaar Launch Ceremony,Salaar Movie Launch,Salaar Launch,Salaar Movie Launch Ceremony Pics,Salaar Begins,Salaar Launch,Prabhas Upcoming Movie Salaar Launch,Prabhas New Movie Launch,Director Prashanth Neel,Salaar Movie Launch Ceremony

ప్రస్తుతం ప్రభాస్ డైరీ నాలుగు పెద్ద సినిమాలతో ఫుల్ అయింది. అన్ని సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సినిమాలే. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఇక ఇది సెట్స్‌లో ఉండగానే ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ తో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. ఈ చిత్రానికి ‘సలార్‌’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమాను హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ వేడుకకు కర్ణాటక డిప్యూటి సీఏం అశ్వత్‌ నారాయణ్‌, కన్నడ అగ్ర హీరో యష్‌, నిర్మాతలు, దిల్‌రాజు, దానయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత విజయ్‌ కిరగందూర్‌, ప్రభాస్‌కు ధన్యవాదాలు… యష్‌ ఈ రోజు మాతో ఉండటం ఆనందాన్ని కలిగించిందని.. ‘సలార్‌’ మిమ్మల్ని నిరాశపరచదు’ అని ప్రశాంత్‌ నీల్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

కాగా ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు… తదితరుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 3 =