ట్యాగ్ · 3 కథనాలు
మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో రెజీనా
తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తన అందం , అభినయం తో రెజీనా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో పాటు మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుని రెజీనా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కార్తీక్ రాజ్ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో సూర్ పాంగాయ్ (శూర్పణఖ )తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రెజీనా ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రెజీనా నమ్మిన సిద్ధాంతం
తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రెజీనా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "ఏక్ లడికీ కో దేఖా తో ఐసా లగా " మూవీ తో రెజీనా బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రీసెంట్ గా సూపర్ హిట్ "ఎవరు " మూవీ తో ప్రేక్షకులను అలరించిన రెజీనా 5 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

రెజీనా ఫస్ట్ టైమ్ సొంత వాయిస్
వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. రెజీనా పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. తమిళ చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకొనే రెజీనా నటించిన శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద, అ ! మూవీస్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ లే డబ్బింగ్ చెప్పారు. ఎవరు మూవీ లో రెజీనా తన పాత్ర కు ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకొన్నారు.