బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సక్సెస్ ఫుల్ “అ ఆ ” మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమకోసమే “, “రాక్షసుడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనుపమ హీరోయిన్ గా నటించిన “తళ్ళి పోగాదే “తమిళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సూపర్ హిట్ “నిన్నుకోరి ” మూవీ తమిళ రీమేక్ గా “తళ్ళి పోగాదే ” మూవీ రూపొందింది. నిఖిల్ హీరోగా రూపొందనున్న “18 పేజెస్ ” మూవీ లో అనుపమ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లాక్ డౌన్ తో 6 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి అనుపమ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్స్ లేకపోతే అనుపమ ఎలా ఉంటారో ఆమె మాటల్లోనే .. కెమెరా ముందు ఉన్నంత వరకే తాను నటిననీ , ఇంటిలోకి అడుగు పెట్టిన వెంటనే పక్కింటి అమ్మాయిలా మారిపోతాననీ , ఇల్లే తన లోకంగా మారిపోతుందనీ, అసలు మేకప్ జోలికే పోననీ , రకరకాల హెయిర్ స్టైల్స్ లో ప్రయోగాలు చేస్తాననీ , ఇంటిలో ఉన్నపుడు అందం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోననీ, అందం అంటే పై పై మెరుగులు కాదనీ , మన మనసు ప్రశాంతంగా ఉండటమే అందం అనీ , ఆలా ఉండడానికే ఎక్కువ ఇష్ట పడతాననీ అనుపమ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























