
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రీమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా గుర్తుందా శీతాకాలం అనుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ వేశారు. అదే టైటిల్ ను ఖరారు చేశారు. అంతేకాదు ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్తో పాటు తమన్నా లుక్ను కూడా చిత్రయూనిట్ విడుదల చేసింది.