
ట్యాగ్ · 2 కథనాలు


150 రోజులుగా ఇంట్లోనే..!

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త చిత్రం 'భ్రమయుగం' ప్రారంభం
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంభమైంది. 'భ్రమయుగం' అనే పేరుతో హారర్ థ్రిల్లర్ కథాంశంగా ఇది రూపొందనుంది. కేరళలోని కొచ్చిలో ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కేరళలో నిర్వహించిన వేడుకలో ఈ మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. సినిమా చిత్రీకరణ ప్రారంభం సందర్భంగా మమ్ముట్టి సహా మూవీ టీమ్ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. అందులో డార్క్ షేడ్స్ లో ఓ ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడా పట్టుకొని కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూడటానికి ఆసక్తికరంగా ఉంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు వై నాట్ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా…

150 రోజులుగా ఇంట్లోనే..!
లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఎంత సోషల్ డిస్టెన్స్ అయినా అన్ని రోజులు ఇంట్లోనే ఉండాలంటే చాలా మందికి కష్టమే. డబ్బున్న వారికి అంటే ఎలా అయినా సాగిపోతుంది కానీ పేద ప్రజలకు మాత్రం అలా కాదుగా.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు ఎందరివో. ఇక సెలబ్రిటీస్ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తున్నారనుకోండి. అయితే ఒక హీరో మాత్రం 150 రోజుల కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే ఉన్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు మలయాళం సీనియర్ హీరో మమ్ముట్టి.