
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల రిలీజ్ సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. ఇక ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ఒక్కో పాటను విడుదల చేస్తూ ప్రమోషన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా జ్యూక్ బాక్స్ ద్వారా అన్ని పాటలను విడుదలచేసింది చిత్రయూనిట్.